

జనం న్యూస్ జనవరి కొత్తగూడెం నియోజకవర్గం
జీవితంలో స్థిరపడటానికి పదవ తరగతి పరీక్షలు అత్యధిక కీలకమని కరకగూడెం మండల ఎంఈఓ గడ్డం మంజుల పేర్కొన్నారు. పదవ తరగతి విద్యార్థులు మ్యాథ్స్ లో పట్టు సాధించాలని ఉద్దేశంతో బిల్లా మదన్ మోహన్ తల్లిదండ్రులైన బిల్లా జానకి ,బిల్లా నర్సయ్య జ్ఞాపకార్థం ఈ మెటీరియల్ ని అందజేస్తున్నట్లు సీనియర్ జంతుశాస్త్ర అధ్యాపకులు డాక్టర్ లింగంపల్లి దయానంద్ తెలియజేశారు.కరకగూడెం మండలంలోని కరకగూడెం, బట్టుపల్లి అనంతారం జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్లో ఆయా కాంప్లెక్స్ హెడ్మాస్టర్స్, మోహన్ బాబు, కరణ్ గారి చేతుల మీదుగా మెటీరియల్ ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, వసంత్ కుమార్, లక్ష్మణ్, కోట్ల రాజు తదితరులు పాల్గొన్నారు.