Listen to this article

జనం న్యూస్ -జనవరి 10- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ హిల్ కాలనీలో ప్రాజెక్టు హౌస్ లో జరుగుతున్న గిరిజన ఆదివాసి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల శిక్షణ తరగతులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ,సినిమా ఆటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి, నల్లగొండ పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి, పాల్గొంటారని కావున గిరిజన ఆదివాసీ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, సానుభూతిపరులు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఒక ప్రకటనలో కోరారు, ఈ కార్యక్రమంలో ట్రై కార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, నల్లగొండ జిల్లా డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ లు పాల్గొన్నారు.