Listen to this article

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ జనవరి 10 : మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లో ఈ నెల 7 నుండి 9 వరకు జరిగిన రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బురద రాఘవపురం విద్యార్థులు కే మహిమ, ఎస్ శ్రావణి లు సీనియర్ గణిత విభాగం లో, విజువలైజింగ్ మ్యాథ్స్ అను ప్రదర్శనను ప్రదర్శించి ప్రథమ బహుమతిని సాధించారు. వీరి ఎగ్జిబిట్ జనవరి 21 నుండి 25 వరకు పాండిచ్చేరిలో జరుగు దక్షిణ భారతదేశ స్థాయి సైన్స్ ఫేర్ కు ఎంపికైనది. ఈ విద్యార్థులు చెప్పే విధానాన్ని విని రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్ కు వచ్చిన గైడ్ టీచర్లు అభినందించారు. శుక్రవారం పాఠశాలలో జరిగిన అభినందన సభలో బహుమతి సాధించిన విద్యార్థులను, వారికి గైడ్ టీచర్లుగా వ్యవహరించిన సాగి సుజాత, పొట్ట రామారావు లను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ హెచ్ శ్రీనివాస్, పాఠశాల సిబ్బంది విజయశ్రీ, శ్రీనివాసరావు, పుల్లయ్య, భారతి, నరేష్, నాగేశ్వరరావు, భావ్ సింగ్, ఎస్ఎంసి చైర్మన్ హేమలత మరియు గ్రామస్తులు అభినందించారు