Listen to this article

జనంన్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 12. తర్లుపాడు మండలంలోని తర్లుపాడు మరియు చెన్నారెడ్డిపల్లి గ్రామాలలో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాల్లో ఉన్న రైతు సోదరులతో కలసి క్షేత్ర సందర్శన చేయడం జరిగినది. తదుపరి వ్యవసాయ అధికారి శ్రీ టి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కంది పంటను ఈనెల 15 నుంచి కొనుగోలు చేయుటకు తర్లుపాడు నందు కొనుగోలు సెంటర్ ప్రారంభించ నున్నామని, దీనికి కంది రైతుల రిజిస్ట్రేషన్ రైతు సేవా కేంద్రాల ద్వారా పూర్తి కావచ్చినదని తెలిపారు. అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా ఆధునీకరణ చేయుటకు కేంద్ర ప్రభుత్వం రైతులకు కేటాయించే 11 అంకెల ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య పొందుటకు అన్ని రైతు భరోసా కేంద్రాల వద్ద గ్రామ వ్యవసాయ సహాయకులు ద్వారా ఫార్మర్ రిజిస్ట్రేషన్ జరుగుతున్నదని, దీని ద్వారా ప్రభుత్వం నుండి వచ్చు వివిధ సబ్సిడీలు, ప్రభుత్వ పథకాలకు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ తప్పనిసరి. కావున రైతు సోదరులు పట్టాదార్ పాస్ బుక్ ఆధార్ కార్డు మరియు ఫోన్ నెంబరుతో గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించాలని కోరారు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ ఎం. నందన మాట్లాడుతూ వేసవిలో పశువుల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గాలికుంటు వ్యాధికి టీకాలు మరియు నివారణ చర్యలు, గొర్రెలు మరియు మేకలలో నట్టల నివారణ చర్యలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సహాయక సిబ్బంది దేవేంద్ర, విష్ణు, గోవింద్ భాష గ్రామ పెద్దలు మరియు రైతులు పాల్గొన్నారు.