Listen to this article

జనం న్యూస్ //ఫిబ్రవరి //12//జమ్మికుంట //కుమార్ యాదవ్..జమ్మికుంట బి ఆర్ ఎస్వి టౌన్ అధ్యక్షుడు కొమ్ము నరేష్ ఆధ్వర్యంలో 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలుపుకోవాలని పోస్ట్ కార్డు నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జమ్మికుంట బిఆర్ఎస్వి టౌన్ ప్రెసిడెంట్ కొమ్ము నరేష్,బి ఆర్ ఎస్ వి రాష్ట్ర కార్యదర్శి హరీష్ వర్మ మాట్లాడుతూ..రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం రావడం కోసం అనేక హామీలు ఇచ్చి స్వయంగా రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి నిండు సభలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు స్కూటీలు ఇస్తానన్నారు.అదేవిధంగా పదో తరగతి పాస్ అయిన విద్యార్థులకు పదివేల రూపాయలు ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు 15 వేల రూపాయలు డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు 25 వేల రూపాయలు పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు 50వేల రూపాయలు విద్యా జ్యోతి పథకం కింద ఇస్తామని చెప్పిన తుగ్లక్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు వాటి ఊసే ఎత్తట్లేదని అన్నారు.కావున వారు చెప్పిన హామీలు అమలు చేయాలని రాహుల్ గాంధీ కి పోస్ట్ కార్డు ద్వారా నిరసన తెలియజేయడం జరిగిందన్నారు.మరియు ఇచ్చిన హామీల గురించి పోస్ట్ కార్డు ద్వారా రాహుల్ గాంధీకి చేరేలా వారి అడ్రస్ కు పోస్ట్ చేయడం జరిగినది, అని తెలిపారు.ఇప్పటికైనా విద్యావంతులు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యను వ్యాపారం చేసి నేడు రాజకీయం చేయబోతున్న ఊట్కూరి నరేందర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చిత్తుచిత్తుగా ఓడగొట్టాలని విద్యాసంస్థల పేరు ఆల్ఫోర్స్ బ్రాండ్ గా చేసుకుని ఊట్కూరి నరేందర్ రెడ్డి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అని ప్రచారం చేస్తున్న ఎందుకు అధికారులు పట్టించుకోవడంలేదని వెంటనే నరేందర్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలన్నారు.విద్యాసంస్థల పేర్లు ఎక్కడ వాడకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు .ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి నాయకులు రాపర్తి అరవింద్ గౌడ్,చాతల రంజిత్, ఒట్టే నాగదేవ్ శిరీష, లావణ్య,తేజస్విని, విద్యా పాల్గొన్నారు.