

పుల్లంపేట మండలంలో గత ఆదివారం జరిగిన నేత్ర చికిత్స క్యాంపు ద్వారా 160 మందికి ఆపరేషన్ జరిగి వారి ని తిరిగి పుల్లంపేటకు పంపించిన సందర్భంగా కడప జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్,రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ముక్కా రూపానంద రెడ్డి గారి సతీమణి ముక్కావరలక్ష్మి , వారి తనయుడు ముక్కాసాయి వికాస్ రెడ్డి యోగక్షేమాలు తెలుసుకొని వరలక్ష్మి గారు వారికి మధ్యాహ్నం భోజనం సంతృప్తిగా వడ్డించి వారికి ఆపరేషన్ ఎలా జరిగాయి వసతి సౌకర్యాలు బాగా కల్పించారా లేదా అని అడిగి తెలుసు కున్నారు. అందులకు ఆపరేషన్ చేయించుకున్న వారందరూ వసతులు చాలా బాగా కల్పించారని ఆపరేషన్ మీద ప్రత్యేక శ్రద్ధలు చూపించి బాగా చేశారని మేమందరము ముక్కా రూపనంద రెడ్డి కుటుంబానికి రుణపడి ఉంటామని, అలాగే అరవింద ఆసుపత్రి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేశారుఈ కార్యక్రమం లో పుల్లంపేట మండలం తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కాపెర్ల చంద్రశేఖర్ నాయుడు, క్లస్టర్ ఇంచార్జి పోలీ జగదీశ్వర్ రెడ్డి, బత్తిన వేణుగోపాల్ రెడ్డి, దాసరి రాజు వాణి శంకర్,భీముశేఖర్ రెడ్డి వెంకటసుబ్బయ్య యాదవ్, పోలు ప్రేమ కుమార్, వర్ధన గారి ప్రసాద్, కుప్పాల మల్లి, కొండేటి చెంగయ్య, జీ.కే సుబ్బారెడ్డి సింగమాల రెడ్డయ్య రెడ్డి మరియు యన్.డి.ఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.