

ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ జనవరి 10
మండల వ్యాప్తంగా శుక్రవారం ముక్కోటి పర్వదినాన్ని ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. టిఎల్ పేట, హిమాంనగర్, నాచారం, తిమ్మారావుపేట తదితర గ్రామాలలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. గార్లఒడ్డు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఉత్తర ద్వారం నుంచి స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ముక్కోటి సందర్భంగా తమ తమ ఇళ్ళ ముందు మహిళలు రంగురంగుల ముగ్గులు వేశారు. గార్లఒడ్డు దేవాలయంలో సొసైటీ చైర్మన్ శెట్టిపల్లి వెంకటేశ్వరరావు ప్రత్యేక పూజలు చేశారు. ఆయా దేవాలయాలలో పూజలు,అభిషేకాలు, తీర్థప్రసాద వినియోగ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలలో అర్చకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.