Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 13( కొయ్యూరు రిపోర్టర్ వి కృష్ణ ) ఆదివాసుల జీవన ఉపాధికి బంగారం లాంటి భవిష్యత్
గిరిజనుల ప్రధాన చట్టం 1/70 సవరించి టూరిజం అభివృద్ధి చేయాలంటూ అసెంబ్లీ స్పీకర్ చేసిన వ్యాఖ్యలపై గిరిజనులు భగ్గుమన్నారు. అఖిలపక్ష ఆధ్వర్యంలో మంగళ వారాల్లో తలపెట్టిన 48 గంటలు రాష్ట్ర మన్యం బంద్ తొలి రోజు మండల వ్యాప్తంగా వున్న ప్రధాన రహదారి కూడళ్ళలో గిరిజనులు అలాగే అఖిలపక్ష నేతలు ఏకమై సంపూర్ణ బంద్ చేశారు. మన్యం మొత్తం స్తంభించడంతో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. 1/70 చట్టాన్ని సవరించ బొమని స్వయంగా ప్రకటించారు, 1/70 చట్టం రద్దు చేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని వివరించారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటనపై స్పందించిన సిపిఎం నాయకులు ఎస్. సూరిబాబు స్పందిస్తూ. గిరిజన హక్కులు చట్టాల పరిరక్షణ బాధ్యత పాలకులపై ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని అఖిలపక్ష నాయకులు గిరిజనులు అంతా సంతోషంగా ఆహ్వానిస్తున్నామని అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందన పై హర్షం వ్యక్తం చేస్తున్నామని ప్రకటించారు.