

జనం వార్తలు;Dt.12.02.2025 ప్రాంతం: గోదావరిఖని, మండలం: రామగుండం, జిల్లా పెద్దపల్లి, తెలంగాణ.
రిపోర్టర్: ఎం రమేష్‌బాబు శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆర్జీ 1 జిఎం శ్రీ లలిత్ కుమార్ గోదావరినది పరివాహక ప్రాంత వన దేవతలయిన శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు ఆర్జీ 1 జిఎం శ్రీ లలిత్ కుమార్ . సింగరేణి సంస్థ ద్వారా భక్తుల సౌకర్యార్థం చేపట్టుచున్న పలు ఏర్పాట్ల కోసం ఆర్.జి.1 ఏరియా జియం అధికారులతో కలిసి పరిశీలించటం జరిగింది.
జియం మాట్లడుతూ ముందుగా సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లకు కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. సింగరేణి సి&ఏం.డి మరియు ఎం.ఎల్.ఏ కి సూచనల మేరకు ఎంతో మహిమ గల అమ్మ వారి దేవాలయాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయుటకు అనుమతులు వచ్చాయని, వారి సూచనల మేరకు భక్తులకు అవసరమైన అన్నిరకాల ఏర్పాట్లు చేపడు తున్నామని జిఎం తెలిపారు. సింగరేణి సంస్థ ఆర్జీ-1 ఏరియా సహాకారముతో భక్తుల సౌకర్యార్థం త్రాగునీటి సౌకర్యం, అమ్మ వార్ల దర్శనానికి వెళ్ళు భక్తులకు కోసం విద్యుత్తు సౌకర్యం, స్నాన గట్టాలు మరియు పరిసర ఆలయ ప్రాంగణమంతయు లైటింగ్ తదితర ఏర్పాట్ల కోసం సంబందిత అధికారులతో పర్యవేక్షించారు. భక్తులకు కనీస అవసరములు కల్పించాలని తాత్కలిక మౌళిక వసతులు కల్పించి త్వరితగతిన కెటాయించిన పనులను పూర్తి చేయలని సంబధిత అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో యస్.ఓ.టు జియం గోపాల్ సింగ్, ఏరియా ఇంజనీరు దాసరి వెంకటేశ్వర్ రావు, ఐఇడి ఆంజనేయులు, ఎన్విరాన్ మెంట్ ఆంజనేయ ప్రసాద్, ఏరియా వర్క్ షాప్ జితేందర్ సింగ్, ఎస్సి సివిల్ వర ప్రసాద్ మరియు ఆలయ కమిటి సభ్యులు పిన్నింటి శ్రీనివాస్ రెడ్డి, జెక్కబోయిన కనకయ్య, మోహన్ రెడ్డి, బంగారు చిన్న రాజన్న, వెంకన్న సాయిలు జనగామ సాయిలు, ఆర్కుటి రాయమల్లు, రామచందర్, సుందర్ రాజు, ముడారి నగేష్, భూమయ్య, ఉదరి కనకయ్య, వెంకన్న, ఆశలు, ఈశ్వర, ఎర్ర మల్లయ్య, పర్వతాలు, భూమయ్య, నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.