Listen to this article

జనం న్యూస్ , 10 జనవరి , ఇల్లంతకుంట : పొత్తూర్ గ్రామంలో ఐపిఎల్ కంపెనీ లిమిటెడ్ వారు మీటింగ్ రైతులకు అవగాహన కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమములో భాగంగా ఎరువుల యాజమాన్యం, నాణ్యత మరియు ఎరువుల వాడకం పై రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐపిఎల్ రాష్ట్ర మేనేజర్ జాఫర్ మక్బూల్ , మండల వ్యవసాయ అధికారి సురేష్ రెడ్డి , ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త మరియు కోఆర్డినేటర్ డా. కె. మదన్ మోహన్ రెడ్డి మరియు శాస్తవ్రేత్త డా.ఏం.రాజేంద్రప్రసాద్ మరియు ఐపిఎల్ జిల్లా మేనేజర్ నిఖిల్ మరియు రైతులు పాల్గొన్నారు.