

జనం న్యూస్ 12ఫిబ్రవరి పెగడపల్లి ప్రతినిధి, మల్లేశం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామమునకు చెందిన దాసరి రాధవ్వ భర్త పేరు: లింగయ్య వయసు 85 సంవత్సరంలు. వృద్దాప్యం కారణముగా గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో నొప్పులతో బాధపడుతుంది.అదే గ్రామంలో ఉన్న నరుకుల్లు లచ్చయ్య వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నదని ఆమె నడిపి కొడుకు దాసరి రాయమల్లు పెగడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా హెడ్ కానిస్టేబుల్ రవీందర్ కేసు నమోదుచేసిదర్యాప్తు ప్రారంభించడమైనది.