Listen to this article

జనం న్యూస్ పిబ్రవరి 12 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి వాంకిడి కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార్ లో బుధవారం సంత్ గురు రవిదాస్ మహారాజ్ 648వ జయంతి ని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా గురు రవిదాస్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలతో ఘన నివాళులు అర్పించారు. భారతీయ బౌద్ధ మహా సభ (బిఎస్ఐ) ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు అశోక్ మాహుల్కర్ మాట్లాడుతూ సంత్ రవిదాస్ మహారాజ్ నిరుపేద కుటుంబంలో జన్మించిన నీతి నియమాలు, దైవభక్తి తో పాటు సమాజంలో అంటరానితనాన్ని దూరం చేయడానికి నిరంతరం కృషి చేశారని, అదేవిధంగా అణగారిన కులాలకు విద్య ప్రాముఖ్యతను చాటి చెప్పారని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ బౌద్ధ మహా సభ జిల్లా ఆర్గనైజర్ విజయ్ ఉప్రే, మతా సైనిక దళ్ జిల్లా ఇంచార్జ్ దుర్గం సందీప్ ,మండల భారతీయ బౌద్ద మహా సభ అధ్యక్షులు జయరాం ఉప్రే , బౌద్ధ ఉపాసకులు పాండుజి జాడే,అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు దుర్గం హంసరాజ్ బౌద్ధ సమాజ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్, సిద్ధార్థ యువజన సంఘం అధ్యక్షులు మహేష్, సమతా భారతి ఐక్యవేదిక నాయకులు డోంగ్రి రవీందర్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు దుర్గం పెంటు,రోషన్, అరుణ్, ప్రతాప్,రమేష్, మనోజ్, దుర్గం శ్రీనివాస్, బలవంత్, దుర్గం చింటూ, శ్రీధర్, శ్రీకాంత్, కిరణ్, దుర్గం ప్రశాంత్, దిలాజి, ప్రదీప్, బాబురావు రా, శ్యామ్ రావు,రాజేశ్వర్,తదితరులు పాల్గొన్నారు.