

అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
– కొత్తవారి కదలికలపై పోలీసులకు సమాచారం అందించాలి
జిల్లా ఎస్పి డి. ఉదయ్ కుమార్ రెడ్డి
జనం న్యూస్ 2025 జనవరి 10 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్) సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలకు సెలవులుండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తారు ఊర్లకు వెళ్తారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఎస్పి డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.సంక్రాంతి పండుగ దృష్ట్యా చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని, ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. రాత్రి వేళల్లో, వీధుల్లో గస్తీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ విషయంలో జిల్లా పరిధిలోని ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు అయన పలు సూచనలు చేశారు.సంక్రాంతికి ఊరెళ్లే వారికి పోలీసుల సూచనలు.దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంటి చిరునామా, ఫోన్ నెంబర్‌ను సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులకు తెలపాలి. దీంతో వారి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేసుకునిఊర్లెళ్లిన వారి ఇళ్లపై నిఘాను ఏర్పాటు చేస్తామని తెలిపారు.మీరు ఇంట్లో లేని సమయంలో మీ ఇంటిని గమనిస్తూ ఉండమని మీ ఇంటి దగ్గర గల మీకు నమ్మకమైన ఇరుగు పొరుగువాళ్ళకు చెప్పడం మంచిది. జిల్లాలో పోలీసులు ఇప్పటికే సీసీటీవీ లను ఇన్ స్టాల్ చేశామని తద్వారా ఎన్నో సంచలనాత్మక నేరాలను ఛేదించామన్నారు. ప్రజలు తమ కాలనీలు, ఇళ్లు, పరిసరాలు, షాపింగ్ మాళ్లలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలి అని తెలిపారు.