

జనం న్యూస్, ఫిబ్రవరి 14; ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కామనగరువు ఆదిత్య పాఠశాలలో రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా 36 వ రహదారి భద్ర తా మాసోత్సవములు 2025 ఫై అవగాహనా సదస్సు ప్రిన్సిపాల్ రామ ప్రసాద్ అధ్యక్షతన బుధ వారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా జిల్లా రవాణా శాఖ అధికారి డి శ్రీనివాస రావు మరియు అమలాపురం పట్టణం , డి ఎస్ పి టి ఎస్ .ఆర్ .కే.ప్రసాద్ పాల్గొని విద్యార్థినీ విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలగురించి తెలియజేసారు. ఈసందర్భం గా డి.టి.ఓ మాట్లాడుతూ వాహనాన్ని నడిపేటప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, మైనర్లు వాహనాలను నడపరాదని ఒక వేళ నడిపినచో వారితోపాటు వారి తల్లిదండ్రులు కూడా శిక్షార్హులని తెలియజెప్పారు. ఈ కార్యక్రమం లో భాగంగా విద్యార్ధులందరి చేత రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమం లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె . ఆర్. రవికుమార్ పి. జె. సురేష్ బాబు మరియు ఆదిత్య జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ చలపతి రావు, స్కూల్ ప్రిన్సిపాల్ రామ ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ సుధ, ఉపాధ్యాయులు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.