

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు పోలీస్ అధికారులతో సమావేశంలో కే భార్గవి జూనియర్ సివిల్ జడ్జ్ నందలూరు అధ్యర్యం లో మార్చి 8 న నందలూరు కోర్టు నందు జరగనున్న జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలని సీనియర్ సివిల్ జడ్జి కే భార్గవి పేర్కొన్నారు శుక్రవారం నాడు 14 వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు నందలూరు కోర్టు నందు పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యక్రమాన్ని అత్యధిక సంఖ్యలో కేసులు వచ్చే విధంగా చూడాలని రాజీమార్గమే రాజమార్గము అనే విషయాన్ని కేసులో ఉన్న ఇరు పార్టీల కక్ష దారులకు అవగాహన కల్పించి రాజీవ్ మార్గం ద్వారా కేసులను పరిష్కరించాలని చూడాలన్నారు ప్రధానంగా క్రిమినల్ సివిల్ చెక్ బౌన్స్ C.C.తదితర కేసులు అన్నింటిని లోక్ అదాలత్ ద్వారా పరిష్కారానికి మీ వంతు కృషి చేయాలి అన్నారు ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి కే భార్గవి పాల్గొన్నారు రాజంపేట రూలర్ సి వి రమణ మరియు పుల్లంపేట ఎస్సై జె మోహన్ కుమార్ గౌడ్ పెనుగులూరు ఏఎస్ఐ నందలూరు ఎస్ఐ వెంకటేశ్వర్లు మరియు కోర్టు సూపర్నెంట్ రమేష్ కుమార్ కోర్టు సిబ్బంది పాల్గొన్నారు