Listen to this article

వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వనమహోత్సవం

జనం న్యూస్ ఫిబ్రవరి 14 జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం రోజున వన మహోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు గుట్ట కింద వనంలోకి గజవాహనంపై స్వామి వారిని మేళ తాళాలతో తీసుకెళ్లి అడవి ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆయా ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కేడిసిసి జిల్లా నెంబర్ ముప్పల రామచందర్ రావు ,మాజీ చైర్మన్ ఎనగంటి సామ్రాట్ గౌడ్,మాజీ ఉపసర్పంచ్ హరీష్ గౌడ్ సంఘం జిల్లా కార్యదర్శి దోసారపు బుచ్చన్న గౌడ్ గౌడ్ సంఘం జిల్లా కార్యదర్శి దోసారపు బుచ్చన్న గౌడ్, ఆలయ జూనియర్ అసిస్టెంట్ రఘు , అడవి శాఖ అధికారులు సెక్షన్ ఆఫీసర్ ప్రకాష్, బీట్ ఆఫీసర్లు రంగు.శ్రీనివాస్,నవీన్,కిరణ్,బాబురావు,సంపత్,ఆలయ అర్చకులు వద్దిపర్తి పెద్ద సంతోష్ చార్యులు మధుచార్యులు చిన్న సంతోష్ చార్యులు ఆలయ సిబ్బంది వెంకటేష, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు నాయకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు