

జనం న్యూస్ ఫిబ్రవరి 14 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి : కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ నూతన సీఐ గా రాజేష్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ రాజేష్, బాలాజీ నగర్ సెక్టార్ ఎస్ఐ లుగా బాధ్యతలు స్వీకరించిన నాగేశ్వరావు లకు కూకట్‌పల్లి నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు కలికోట శంకర్ ఆధ్వర్యంలో బాలాజీ నగర్ డివిజన్ అధ్యక్షులు కృష్ణ రాజ్‌పుత్ కలిసి వారికి పూల బోకే అందజేసి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమములో కూకట్‌పల్లి యూత్ కాంగ్రెస్ కార్యదర్శి శ్రవణ్, ఏఎంసీ వైస్ చైర్మన్ ప్రకాష్ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వరూప గౌడ్, బండి సుధ, ఎండీ అక్బర్, శ్రీకాంత్ ముదిరాజ్, పండు ముదిరాజ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఎండీ. జంగీర్, బాలాజీనగర్ డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సుల్తాన్, అంజి రెడ్డి, శంకర నాయక్, బాలయ్య,వీరన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు.