

జనం న్యూస్ ఫిబ్రవరి 14 కాట్రేని కోన : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం గెద్దనపల్లి గ్రామంలో సామూహిక ఎలుకలు నిర్మూలన కార్యక్రమం చేపట్టారు వ్యవసాయ అధికారులు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కె ప్రవీణ్. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు ఎలుకలు యొక్క జీవిత చక్రం గురించి, వరి పంటపై చేయు నష్టం గూర్చి, ఎలుకల నిర్మూలనపై చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు.ప్రతీ రైతు సేవా కేంద్రం నందు గ్రామ వ్యవసాయ సహాయకులచె సామూహిక ఎలుకల నిర్మొలనా కార్యక్రమం జరిగినది. రాష్ట్ర ప్రభుత్వం ఎలుకుల నిర్మూలన కొరకు రైతులకు బ్రోమోడియోలోన్ మందును ఉచితం గా పంపిణీ చేస్తుంది. ఎలుకులు నుండి వరి పంట ను కాపాడుకునేందుకు ప్రతీ రైతూ కూడా ఈ బ్రోమోడియోలోన్ మందును 2గ్రాములు, నూనె 2గ్రాములు 96గ్రాముల నూకలు తో విషపు ఎర తయారుచేసుకుని చిన్నచిన్న పొట్లాలలో కట్టుకుని ఎలుకల కన్నలలో ఉంచినట్లు అయితే ఎలుకలు నిర్మొలించబడతాయి. ఈ మందును మీ దగ్గర్లో ఉన్న రైతు సేవా కేంద్రం నుండి ఉచితంగా పొందవచ్చు, లేదా నూకలు తెచ్చుకుంటే సిబ్బంది మందు కలిపి ఇస్తారు. ప్రతీ గ్రామంలో వరి రైతులు సామూహికంగా ఈ మందు వాడినట్లయితే ఎలుకలు సమర్థవంతం గా నిర్మొలింపబడతాయి. కె. ప్రవీణ్, మండల వ్యవసాయ అధికారి మరియు పెస్టిసైడ్ ఇన్స్పెక్టర్, కాట్రేనికోన