

జనం న్యూస్ ఫిబ్రవరి 14: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలంలోనిబట్టా పూర్ గ్రామంలో దోమల నివారణకై పంచాయతీ కార్యదర్శి ఆకులరవిమరియు కరోబార్ కొండాశంకర్ శుక్రవారంరోజునాతగు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. గ్రామంలో దోమల నివారణకు ఫాగింగ్ చేయించి నట్లు, మళ్ళీ గ్రామంలోనీ మురికి కాలువల్లో దోమల నివారణకు గ్రామ పంచాయతీ సిబ్బంది తో మందు పిచికారి చేస్తున్నాట్లు తెలిపారు. గ్రామ ప్రజలు కూడా పరిసరాలు శుభ్రంగా ఉంచాలని, తడి, పొడి చెత్తలను చెత్త ట్రాక్టర్ ల్లో వేయాలని గ్రామ ప్రజలకు తెలిపారు.