

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి జనవరి 10, (జనం న్యూస్):-మార్కాపురం: పట్టణ సమీపంలోని గుండ్లకమ్మ నది తీరాన వెలసిన శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి వేడుకలు వైభవంగా నిర్వహించారు. స్వామి వారు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుని తరించారు. ఆలయ అర్చకులు స్వామివారి ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించారు. ఆలయ నిర్వహకులు స్వామివారి ఉత్తర ద్వారాన్ని పూలతో ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా అలంకరించి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ కమిటీ ప్రతినిధులు ఊటుకూరి రామకృష్ణ, చక్క మాలకొండ నరసింహారావు తదితరులు పర్యవేక్షించారు.