

హిమగిరి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సెక్రటరీ ఎం సత్తిబాబు
జనం న్యూస్ ఫిబ్రవరి15( కొయ్యూరు రిపోర్టర్ వి కృష్ణ ) అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం అంతాడ పంచాయితీ కొత్తపల్లి గ్రామం లో 14/02/25 తారీఖున హిమగిరి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వారి ఆధ్వర్యం లో గిరిజన మహిళలకు కుట్టుశిక్షణ కేంద్రం మూడు నెలల పాటు నేర్చుకొనుటకు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హిమగిరి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సెక్రటరీ యం.సత్తిబాబు పాల్గొని మాట్లాడుతూ కొత్తపల్లి గ్రామం లో మహిళలకు టైలరింగ్ శిక్షణ మూడు నెలలు పాటు ఉచితం గా ఇవ్వడం జరుగుతుంది .శిక్షణ కాలం పూర్తి అయిన వెంటనే సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది ఈ శిక్షణ బాగా నేర్చుకునట్లుయితే చాలా గిరిజన గ్రామాలలో ఆసక్తి ఉన్న మహిళలు అందరికీ రాబోయే కాలం లో చాలా కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేసారు .ఈ కార్యక్రమంలో ఏ వి భగవాన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పాల్గొని మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా టైలరింగ్ నేర్చుకున్న మహిళలకు స్వయం ఉపాధి కి దోహద పడుతుందని అందుకు ప్రతి మహిళా పట్టుదల తో ఈ యొక్క శిక్షణ వినియోగించు కోవాలని తెలియజేసారు.ఈ శిక్షణ కార్యక్రమం లో లిఫ్ట్ రూరల్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ సెక్రటరీ సి హెచ్ వి యస్ ఆర్ ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ గతంలో ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ప్రతిభ కనబర్చిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది అని తెలియజేసారు.ఈ కార్యక్రమ లో హెల్ప్ సంస్థ సెక్రెటరీ జి .శ్రీనిబాబు , రేవతి చార్టబుల్ ట్రస్ట్ డైరెక్టర్ బి . శివ లిఫ్ట్ సంస్థ గౌరవ అధ్యక్షులు వి .అప్పారావు ,సి.ఆర్. డి ఎస్ డైరెక్టర్ ఎస్ . నూకరాజు ,మారుతి విలేజ్ ఫుడ్స్ డైరెక్టర్ కె.శేషు బాబు గ్రామం లోపెద్దలు మహిళ లు పాల్గొన్నారు .