

జనం న్యూస్ ఫిబ్రవరి 15( కొయ్యూరు రిపోర్టర్ వి కృష్ణ )మర్రివాడ పంచాయతీ దొడ్డవరం ఎన్ఆర్జీఏస్ లో విఆర్ పీ జుర్రా. సత్తిబాబు గత కొంత కాలంగా పలు అవకతవకలకు పాల్పడుతున్నారంటూ సర్పంచ్, గ్రామస్తులు, ఉపాధి కూలీలు ఆరోపణలు చేయడం విదితమే ఈ క్రమంలో గురువారం నాడు సర్పంచ్ మరియు తెలుగుదేశం నాయకులు “వి ఆర్ పీ” విధులలో పాల్పడుతున్న అక్రమాలు తెలియ పరుస్తూ అతడిని విధులనుంచి తొలగించి కొత్త వారిని నియమించాలని మండల అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా దొడ్డవరం గ్రామం లో ఎమ్ పీ డి ఓ ఏస్ కే వి. ప్రసాద్ ఆదేశాల ప్రకారం ఏపీ ఓ అప్పలరాజు ఆధ్వర్యంలో విచారణ నిర్వహించినట్టు సర్పంచ్ మాదల. సత్యవతి ప్రకటించారు. ఈ విచారణఫై ఏపీఓ అప్పలరాజు ను మీడియా మిత్రులు వివరణ కోరగా…..సర్పంచ్ విఆర్పీ ఫై ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ నిర్వహించడం జరిగిందని, ముందు రోజు వి ఆర్ పీ జుర్రా. సత్యన్నారాయణకు విచారణకు హాజరు కావాలని తెలిపినా అతను హాజరు కాలేదని మరియు మండల కేంద్రం లో నిర్వహించే శుక్రవారం శిక్షణా తరగతులకు సైతం హాజరు కాలేదని తెలిపారు. గ్రామం లో విచారణ సమయంలో సర్పంచ్,గ్రామస్తులు, ఉపాధి కూలీలు ఇచ్చిన సమాచారం ని ఉన్నత అధికారులకు పంపుతున్నామని, ఈ సమాచారం ఆధారంగా వి ఆర్ పీ ఫై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఉన్నత అధికారులు నిర్ణయిస్తారని, ఫై అధికారులనుంచి ఆదేశాలు వచ్చేవరకు వి ఆర్ పీ జే. సత్యన్నారాయణ విధులకు హాజరుకారు అని, అతని స్థానం లో వేరే వి ఆర్ పీ విధులు నిర్వహిస్తారని తెలిపారు.