

జనం న్యూస్ ఫిబ్రవరి 14 చిలుకూరు (మండల ప్రతినిధి ఐనుద్దీన్) ప్రతి సంవత్సరం రెండు రోజులపాటు నిర్వహించే కనకదుర్గ జాతరను చిలుకూరు మండలంలోని జెర్రిపోతులగూడెం గ్రామంలో గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు ముందుగా రైతులు,కర్షకులు తమ వ్యవసాయ వాహనాలకు రంగు రంగుల ప్రభలు కట్టి భారీ ఊరేగింపుతో అమ్మవారి దేవాలయంలో చుట్టూ ప్రదక్షణ చేసి రాత్రి అక్కడే ఉంచి మర్నాడు ఉదయాన్నే అమ్మవారిని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు రెండవ రోజులో భాగంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం కోలాట ప్రదర్శనలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెజవాడ వెంకటేశ్వర్లు,ధనుంజయ నాయుడు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలకు అన్నివేళలా ఉండాలని కోరారు,రాత్రి వివిధ పార్టీల ఆధ్వర్యంలో భారీ లైటింగ్ లతో డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమాలను ప్రదర్శనలు ఏర్పాటు చేశారు ఎలక్షన్స్ కోడ్ ఉన్నందున ఎన్నికల సంఘం నియమావళి అనుగుణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చిలుకూరు ఎస్సై రాంబాబు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బందోబస్తునే ఏర్పాటు చేశారు.