Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 15.తర్లుపాడు మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా ఆధునీకరణ చేయుటకు కేంద్ర ప్రభుత్వం రైతులకు 11 అంకెల ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య ఆధార్ కార్డు తరహాలో రైతులకు అందించనుంది. కావున పొలము ఉన్న కవులు చేసుకునే ప్రతి రైతు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పధకాలు రాయితీలు పొందాలంటే ఈ 11 అంకెల విశిష్ట సంఖ్య నమోదు (ఫార్మర్ రిజిస్ట్రీ) తప్పనిసరిగా నమోదు చేపించుకోవలెను.రాష్ట్రంలోని భూమి గల ప్రతి రైతుకు ఒక ప్రత్యేక రైతు గుర్తింపు సంఖ్యను ఇవ్వడం ద్వారా వ్యవసాయ సేవలను సులభతరం చేసి పారదర్శకంగా మరింత అందుబాటులోకి తీసుకొని రావటం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.ఇది వ్యవసాయం రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం సమన్వయంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ చేపడుతున్న బృహత్తర కార్యక్రమం.రైతు గుర్తింపు సంఖ్య నమోదు ప్రక్రియలో ముఖ్యాంశాలు:రైతు గుర్తింపు సంఖ్య అనేది రైతు రిజిస్ట్రీ పోర్టల్ లో నమోదు చేసిన తర్వాత భూమి గల ప్రతి రైతుకు కేటాయించబడే ప్రత్యేక గుర్తింపు సంఖ్య.ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, ఇతర వ్యవసాయ సంబంధిత సేవలను పొందడానికి ఈ సంఖ్య అధికారిక గుర్తింపుగా పనిచేస్తుంది. రైతుకు చేకూరే ప్రయోజనాలు ఈ విశిష్ట సంఖ్య అర్హులైన భూమిగల రైతులు గుర్తించడంలో తోడ్పడి వారికి ప్రభుత్వం నుండి వచ్చు వివిధ సబ్సిడీలు, పంటల బీమా వంటి ప్రయోజనాలు పొందేలా చేస్తుంది.ప్రభుత్వం అందించే పథకాలు నిరవధికంగా పొందేందుకు ఈ సంఖ్య ఉపయోగపడుతుంది.11 అంకెల విశిష్ట సంఖ్య నమోదు (ఫార్మర్ రిజిస్ట్రీ) పూర్తి చేసుకున్న రైతులకు దిగువ తెలిపిన ప్రభుత్వ పధకాలు వర్తించును..పీఎం కిసాన్ చెల్లింపులు,అన్నదాత సుఖీభవ పంటల భీమా,.పంట రుణాలపై వడ్డీ రాయితీ,రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలు,రాయితీ పై సూక్ష్మ పోషకాలు,సూక్ష్మసేద్యం పై రాయితీ,పంట రుణాలు,పెట్టుబడి సాయంతదితర పథకాలలో నేరుగా లబ్ది పొందే అవకాశం కలుగుతుంది. అంతేగాక సత్వర పరిహారం అందుటకు ఉపయోగపడుతుంది. నీటిపారుదల, తెగుళ్ళ నియంత్రణ, వాతావరణ సూచనలు వంటి ఇతర సేవలు అందుకోవడానికి తోడ్పడుతుంది. గ్రామ సచివాలయంలో ఉన్న డిజిటల్ అసిస్టెంట్ ,వెల్ఫేర్ అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్ , గ్రామ రెవిన్యూ అధికారి మొదలగు సిబ్బందిని సంప్రదించి, రైతు గుర్తింపు సంఖ్యను (11 అంకెల ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య) పొందవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో భూమి గల ప్రతి రైతుకు, మున్ముందు కౌలు రైతులకు, భూములేని వ్యవసాయ కూలీలు, ఇతర వ్యవసాయ ఆధారిత వృత్తులలో ఉన్న వారికి ఇది వర్తిస్తుంది. రైతులు దిగువ తెలిపిన పత్రాలను తీసుకుని గ్రామంలో రైతు సేవా సిబ్బందిని కలిసి రైతు గుర్తింపు సంఖ్య (11 అంకెల ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య) పొందే ప్రక్రియను పూర్తి చేసుకోవలసిందిగా మనవి చేస్తున్నాము.1.ఆధార్ నెంబర్2.ఆధార్ అనుసంధారిక ఫోన్3.భూమి రికార్డులు వివరములు (పట్టాదారు పాస్ బుక్)పూర్తి వివరములకు రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి గ్రామ సహాయకులను సంప్రదించవలసిందిగా తెలియజేయడమైనది.