Listen to this article

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రవీందర్ ఆవేదన..

జనం న్యూస్ //ఫిబ్రవరి //15//జమ్మికుంట //కుమార్ యాదవ్.. వాల్మీకి బోయ సంఘం అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చందబోయిన రవీందర్ మాట్లాడుతూ..హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు కి మా మర్రిపెళ్లి గూడెం గ్రామంలో, గత ప్రభుత్వము 10 సంవత్సరాలు కింద డబల్ బెడ్ రూములు ఇండ్లు నిర్మాణం చేసినారన్నారు.గత ప్రభుత్వము నిర్మాణం చేసినటువంటి 50 కుటుంబాలకు 50 నివాసాలు ఉండే ఈ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎప్పుడో నిర్మాణం అయినయి అన్నా రు.అయినా వాటిని గత ప్రభుత్వము ఓట్ల కోసము పంపకాలు చేయకుండా పక్కదారి పట్టించా రన్నారు. అప్పుడు ఉన్నటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యేగా అయినా హుజురాబాద్ ఆర్థిక శాఖ మంత్రి, ఈటల రాజేందర్ కూడా బీద ప్రజలకు పంపకాలు చేయకుండా జాప్యం చేసినాడన్నారు.మరో ఐదేళ్లు మంత్రిగా ఉండి కూడా ఈ నిర్మాణంలో ఉన్నటువంటి డబల్ బెడ్ రూమ్,విషయంలో ఎలాంటి న్యాయం చేయకుండా, మధ్యంత రా ఎన్నికల్లో ఓట్లు వేయండి నేనున్నాను అనుకుంటూ, రాజీనామా చేసిన రాజీ పడకుండా పోటీ చేస్తున్న అని,వస్తే, మళ్ళీ గెలిపించుకున్నామన్నారు.కానీ అతడి నుండి కూడా బీసీ ప్లాట్ లకు సంబం ధించిన ఎస్సీ ప్లాట్ లకు సంబంధించిన పంపకాలు జరగలే దన్నారు. ఆ గ్రామా సర్పంచ్ అప్పుడు, ఎస్సీ ప్లాట్లు, బిసి ప్లాట్లు కష్టపడి పంచడం జరిగిందన్నారు.కానీ కుటుంబాల వారిగా ఇబ్బంది పడుతున్న బీసీ వారికి బీసీ ప్లాట్ లలో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణము పూర్తిగా అయిపోయి ఉన్నది, కాబట్టి మిగిలిపోయిన వర్కు వాటర్ ట్యాంక్ మరియు, పవర్, డ్రైనేజీ వ సిసి రోడ్ల వరకు పని మిగిలి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణన్ బాబు వచ్చి పరిశీలన చేసినారన్నారు.ఆ ఇండ్ల స్థలంలో చెట్లు బాగా పెరిగినాయి, ఎటు అక్కరకు రాకుండా ఉపయోగం లేకుండా ఉన్నందున,మీరు చొరవ తీసుకొని, సీఎం దృష్టికి తీసుకెళ్లి, ఈ యొక్క మర్రిపెల్లి గూడెంలో డబుల్ బెడ్ రూమ్ 50 కుటుంబాలు జీవనోపాధి కూలి నాలి చేసుకుంటూ జీవించే అర్హులైన పేదలకు నిరుపేదలకు భూమిలేని వారికి పంపకాలు చేయాలని కోరారు. ముఖ్యంగా మా మర్రిపెళ్లి గూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు చేస్తూ పార్టీ కోసం పార్టీ శ్రేయస్ కోసం పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు స్వచ్ఛందంగా కష్టపడే కార్యకర్తలను సీనియర్ నాయకులను ఏ కార్యక్రమం అయినా ఏ ప్రోగ్రాం అయినా వర్గ భేదాలు లేకుండా మరిపెళ్లి గూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానించే వారిని పక్కన పెట్టకుండా,గ్రామంలో కార్యకర్తలను సీనియర్ నాయకులను పార్టీ పరంగా నియోజకవర్గ పరంగా కార్యక్రమాలకు తెలియజేయాలాని సూచించారు. ఇలా పోతే మర్రిపెళ్లి గూడెం లో పార్టీ అభిమానులను పార్టీ కార్యకర్తలను పార్టీకి సేవ చేసే శ్రేయోభిలాషులను కాపాడుకోవాలని హక్కును చేర్చుకోవాలని కలుపుకొని పోవాలన్నారు.కార్యకర్తలకు సీనియర్ జూనియర్ తేడా లేకుండా మీరు ఒకసారి మరి పెళ్లి కూడా మేజర్ గ్రామపంచాయతీ మీటింగ్ ఏర్పాటు చేసి రాబోయే స్థానిక ఎలక్షన్లో మునుముందు కాంగ్రెస్ పార్టీ నాయకులను గెలిపించుకోవాలని,తెలిపారు.పార్టీ పరంగా తమరు నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు కాబట్టి, పార్టీ కి తప్పు చేసిన వారిని, వెంటనే పార్టీ తొలగించాలని, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.