

జనం న్యూస్ 15 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : గంట్యాడ మండలంలోని గింజేరు జంక్షన్ వద్ద గంజాయి అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎసిఐ సాయి కృష్ణ తెలిపారు. బొండపల్లి మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన కొల్లి పూర్ణచంద్రరావు అలియాస్ చందు అనే వ్యక్తి సుమారు 1500 గ్రాములు గంజాయిని తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పట్టుకోవడం జరిగిందన్నారు. నిందితుడిని రిమాండ్‌కి తరలించినట్లు తెలిపారు.గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.