

జనం న్యూస్ 15 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : 2023 పోస్టల్ యాక్ట్‌ను రద్దు చేయాలని పోస్టల్ యూనియన్ నాయకులు వి.శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం విజయనగరం పోస్టల్ కార్యాలయం ముందు జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తపాల శాఖను ప్రైవేట్ పరం చేయడాన్ని తక్షణమే ఆపాలని అన్నారు. జిడిఎస్‌లను 8వ వేతన సంఘంలోకి తీసుకురావాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.