

జనం న్యూస్ 15 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : విజయనగరం పట్టణం స్థానిక కంటోన్మెంట్‌లోని జడ్పీ హైస్కూల్లో CI ఎస్. శ్రీనివాసరావు శుక్రవారం ఎస్‌ఐ. రేవతి ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. ఉజ్వల భవిష్యత్తుకు మంచి బాటలు వేసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.