Listen to this article

జనం న్యూస్ 15.ఫిబ్రవరి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కెరమేరీ :మండలంలోని లక్ష్మి పూర్ కు చెందిన నిరుపేద కుటుంబం లో జన్మించిన ఇస్లావత్ శ్రీకాంత్ అంగవైకల్యం (ఛాతి భాగం )ఉంది. శారీరకంగా ఏదగలేదు (ఎత్తు )రెక్కడైతేగాని డొక్క నిండని పరిస్థితి. పేదరికంతో తల్లితండ్రి కూలీపని చేసుకుంటూ పోషిస్తున్నారు కాని భవిష్యత్తు లో తన పరిస్థితి దారుణంగా ఉంటుందని శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పింఛన్ కోసం సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరిగిన ఫలితం లేదంటున్నాడు ఇప్పటికైనా అధికారులు స్పందించి పింఛన్ మంజూరుచేసి ఆదుకోవాలని మనవి చేస్తున్నాడు.