

ఇబ్బందులు పడుతున్న వ్యాపారులు, వాహనదారులు
జనం న్యూస్ ఫిబ్రవరి 15 (ముమ్మిడివరం ప్రతినిధి ) మండల కేంద్రమైన కాట్రేనికోనలో ప్రధాన రహదారి పైన ఆవులు, ఆబోతులు స్వైర విహారం చేస్తున్నాయి. రహదారిపై తిష్ట వేస్తూ వాహనదారులకు ఇబ్బందులు కలగజేస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. ఒక్కొక్కసారి ఆబోతుల మధ్య పోట్లాట జరిగినప్పుడు అక్కడున్న పలువురు గాయపడిన సంఘటనలు గతంలో జరిగాయి. కాట్రేనికోన గేట్ సెంటర్లో ఒక మేక బైకుకు అడ్డు రావడంతో చెయ్యరు గ్రామానికి చెందిన వీఆర్వో తీవ్రంగా గాయపడి అనంతరం మరణించారు. పాలు యజమానులకు పాట్లు వాహనదారులకు అన్నట్లు ఈ ఆవుల తీరు ఉంది. కాట్రేనికోన సర్పంచ్ గంటి సుధాకర్ గతంలో ఈ సమస్యపై స్పందించి వాటిని వేరేచోటకు మరలించే ప్రయత్నం చేశారు. దీంతో సంబంధిత ఆవుల యజమాన్యం వాటిని కంట్రోల్ చేసింది. తర్వాత పాత కథే పునరావృతం అయింది. ఈ ఆవులు షాపుల్లోకి చొచ్చుకుని పోవడంతో తమకు నష్టం వాటిల్లుతుందని బాధిత వ్యాపారుల వా పోతున్నారు. రోడ్లపైకి వచ్చే ఆవులను బంధించి లైట్ హౌస్ కరవాక వంటి ప్రాంతానికి తరలించాలని పలువురు సూచిస్తున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి