

జుక్కల్ ఫిబ్రవరి 15 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాల్లో జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతారావు పాల్గొని
ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ సమాజ హితం కోసం ఆయన చూపిన మార్గం సదా అనుసరణీయమని, సేవాలాల్ మహారాజ్ బోధనలను సమాజంలోకి తీసుకెళ్లడంతో పాటు మన వంతుగా వాటిని పాటించడానికి కృషి చేద్దాం అని అన్నారు మనిషిగా పుట్టి మహర్షిగా మారి, బంజారాల జీవితాల్లో వెలుగులు నింపి.. నేడు అదే జాతి జనుల ద్వారా దైవత్వాన్ని పొంది పూజింపబడుతున్న ఆదర్శమూర్తి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి బంజారా సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు.ఈ ఉత్సవ కార్యక్రమంలో బంజారా నాయకులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు.
