

గ్రామాలలో 100% ఇంటి పన్నును వసూలు చేయాలి
జనం న్యూస్ ఫిబ్రవరి 15 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ రానున్న వేసవి కాలంలో గ్రామాల్లో త్రాగునీరుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. శనివారం మునగాల మండల పరిధిలోని బరాఖత్ గూడెంమపంచాయతీ కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించారు అనంతరం గ్రామంలోని నర్సరీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో 100% ఇంటి పన్నులు వసూలు చేయాలని అధికారులకు సూచించారు. రానున్న వేసవి కాలంలో నర్సరీలో మొక్కల పట్ల నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మొక్కలకు ఎప్పటికప్పుడు నీళ్లు పొయ్యాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఆంజనేయులు,ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్,ఎంపీఓ శ్రీనివాస్, ఏపీవో శైలజ,ఆర్ ఐ రామారావు, పంచాయతీ కార్యదర్శి శ్వేత తదితరులు పాల్గొన్నారు.