Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 15జమ్మికుంట కుమార్ యాదవ్. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో,కొండపాక నుండి పొత్కపల్లికి మానేరు వాగు లో సొంత ఖర్చులతో మట్టి రోడ్డు ను నిర్మించినా దాతలు.. పెద్దపెల్లి రాజయ్య మాజీ సర్పంచ్, కాసర్ల అనిల్ కుమార్ మున్నూరు కాపు ప్రెసిడెంట్, మున్నూరు కాపు వైస్ ప్రెసిడెంట్ దాట్ల శ్రీనివాస్, కాసర్ల వీరస్వామి, మరియు కాసర్ల సమ్మయ్య,బుచ్చయ్య,నల్లగాసే స్వామి, రాచర్ల రాజమల్లు, వీరి ఇరుగురు.. చాలా పెద్ద మనసుతో, జమ్మికుంట నుండి వెళ్లే కొండపాక గ్రామం నుండి, పోత్కపల్లి మరియు,,సుల్తానాబాద్,ఓదెల, పెద్దపెళ్లి, వెళ్లే ప్రధానమైన, అతి దగ్గరగా వెళ్లే రోడ్డు హనదారులకు ఇబ్బందిగా మారడం వల్ల వాళ్ళ ఇబ్బందులను చూసి, మనసు చెలించి, వీరి ఇరువురు ఒక నిర్ణయం తీసుకొని సొంత డబ్బులతో, తాత్కాలిక మట్టి రోడ్డు నిర్మించారు చుట్టుపక్కన ఉన్న గ్రామాల వాళ్ళు ఆ రోడ్డుపైన వెళ్లే వాహనదారులు, వీరి ఇరువురికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా, మట్టి రోడ్డు నిర్మాణ దాతలు మాట్లాడుతూ.. పెద్దపెల్లి మంచిర్యాలకి వెళ్లే, ఫోర్ వీలర్, మరియు టూ వీలర్, వాహనదారులకు అతి తక్కువ రోడ్డు ప్రయాణంలో ఈ రోడ్డు మార్గంలో చాలామంది వాహనదారులు వెళుతుంటారని తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణం బాగా లేనందున, వాహనదారులు పడే ఇబ్బందులను చూసి, మేము ఇరువురం ఒక నిర్ణయానికి వచ్చి, మా సొంత డబ్బులతో, తాత్కాలిక మట్టి రోడ్డు నిర్మించాలని, నిర్ణయం తీసుకున్నాకే, మట్టి పోసి, వాహనదారులు వెళ్లే విధంగా చేశామని, వివరించారు. వాహనదారులు ఇప్పుడు వెళుతున్న సందర్భంలో వారి చిరునవ్వును చూసి, మాకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు.ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యులు అయినా , రాజయ్య, అనిల్ కుమార్, శ్రీనివాస్, వీరస్వామి, మరియు సమ్మయ్య, బుచ్చయ్య, స్వామి, రాయమల్లును, గ్రామస్తులు అభినందనలు తెలియజేసారు.