Listen to this article

భోజనం వండటానికి ముందే ప్రతి రోజు క్రమం తప్పకుండా ఆహార పదార్థాలను పరిశీలించాలి

జిల్లా అదన కలెక్టర్ రాంబాబు

జనం న్యూస్ ఫిబ్రవరి 16 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. శనివారం మునగాల మండల పరిధిలోని ఆకుపాముల గ్రామ శివారులోని గురుకుల పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాలను,భోజనాన్ని పరిశీలించారు వంటకు పరిశుభ్రమైన నీటిని వినియోగించాలని,మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు.అనంతరం పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భోజనం వండటానికి ముందే ప్రతి రోజు క్రమం తప్పకుండా ఆహార పదార్థాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, నాసిరకం, నాణ్యతా లేమితో కూడిన పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించకూడదని ఆదేశించారు.నిర్దేశిత డైట్ మెనూ ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. పరిశుభ్ర పాటించాలని, విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఆంజనేయులు, మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్, ఆర్ ఐ రామారావు, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.