

రేపాల స్వయంభు లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన- ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి
జనం న్యూస్ ఫిబ్రవరి 17( మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) తెలంగాణలోని పురాతనమైన ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు.కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వచ్చేనెల 9 వ తారీకు నుంచి ప్రారంభం కానున్న రేపాల స్వయంభు లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలని, బ్రహ్మోత్సవాలకు సహాయ సహ కారాలు అందిస్తానని, ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. బ్రహ్మోత్సవాలకు ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని దేవస్థాన చైర్మన్ సారిక రామయ్య కు సూచించారు.ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ సారిక రామయ్య మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే ఆవిష్కరించినట్లు తెలియజేశారు.ఆలయ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యేను కోరినట్లు తెలిపారు.