

తనిఖీ చేసిన మండల డిప్యూటీ ఎమ్మార్వో సింధుజ
జనం న్యూస్ ఫిబ్రవరి 16 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చండూరు గ్రామంలో శనివారం నాడు చిలిపిచేడ్ మండలం లోని ప్రాథమిక పాఠశాల చండూరును ఉదయం మండల విద్యాధికారి మరియు డిప్యూటీ తహసిల్దార్ సందర్శించడం జరిగింది .పాఠశాలలోని మౌలిక వసతులగూర్చి పాఠశాల ప్రధానోపాధ్యాయులతో చర్చించడం జరిగింది .తరగతి గదిని పరిశీలించి విద్యార్థుల యొక్క సామర్ధ్యాలను పరీక్షించడం జరిగింది .అదేవిధంగా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయడం జరిగింది .విద్యార్థులందరూ బాగా చదువుకోవాలని సూచించడం జరిగింది . ఈ సందర్భంగా మండలంలోని అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధ్యాహ్న భోజనం పై ప్రత్యేక శ్రద్ధ వహించి రుచికరమైన భోజనం అందించాలి మరియు పరిశుభ్రతను పాటించాలని తెలియజేయడం జరిగింది . ప్రతిరోజుపాఠశాలలోని ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనం వడ్డించే ముందు భోజనం యొక్క రుచి చూసి టేస్ట్ రిజిస్టర్ లో నమోదు చేయాలి అని ఎంఈఓ సూచించడం జరిగింది . డిప్యూటీ తహసిల్దార్ మండలంలోని అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని మరియు నాణ్యమైన విద్యను అందించాలని సూచించడం జరిగింది .ఇందులో మండల విద్యాధికారి విట్టల్ చిలిపిచేడు మండల డిప్యూటీ తాసిల్దార్ సింధు మేడం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు