

జనం న్యూస్ 16 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ :విజయనగరంలో సుదీర్ధ కాలం ఓ పత్రికలో జర్నలిస్ట్‌గా పనిచేసిన శనపతి శ్రీనివాసరావు చికిత్స పొందుతూ ఆదివారం వేకువజామున మృతి చెందారు. శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బ్రెయిన్ కు శస్త్ర చికిత్స జరిగింది. ఆయన చికిత్స నిమిత్తం తోటి జర్నలిస్ట్‌లు విరాళాలు సేకరించి ఇటీవల కుటుంబ సభ్యులకు అందజేశారు. పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు.