

గుస్సాడి బృందానికి కేంద్ర మంత్రి సన్మానం.
జనం న్యూస్.16 ఫిబ్రవరి.కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.కె ఏలియా జైనూర్ : పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు బృందం జనవరి 26న జరిగిన గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించిన గోండ్, కొలం గుస్సాడీల ప్రదర్శనలు చరిత్రలో నిలుస్తాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నట్లు గుస్సాడి బృందం అధ్యక్షులు కనక సుదర్శన్ తెలిపారు. గుస్సాడి అసోసియేషన్ అధ్యక్షులు సభ్యులు శనివారం హైదరాబాద్ లో మంత్రి క్యాంపు కార్యాలయంలో కలవగా గుస్సాడి అధ్యక్షులు కనక సుదర్శన్, ఏర్మా హన్మంతుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శాలువాతో సన్మానం చేసారని కనక సుదర్శన్ తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల సందర్బంగా నిర్వహించిన కర్తవ్యా పత్ జయంతి జయ భారత ప్రదర్శనలు 5000మంది కళాకారులు ప్రదర్శన నిర్వహించి గిన్నిస్ రికార్డ్ బుక్ లో ఎక్కినందుకు అయన అభినందించిన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చించు యాక్షన్ పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్య హైదరాబాద్ టౌన్ బిజెపి అధ్యక్షులు లంక దీపక్ రెడ్డి తెలంగాణ కళాకారుల ప్రోగ్రాం ఇంచార్జ్ గడ్డం హిమగిరి సమక్షంలో సన్మానం చేసినట్లు తెలిపారు. గుస్సాడి ప్రదర్శనలు కేంద్ర మంత్రి అభినందించారని అయన పేర్కొన్నారు.