Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 16 ప్రకాశం జిల్లా తర్లుపాడు లో మహాత్మా గాంధీ  జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టారు.భూగర్భ జలాలను పరిరక్షించేందుకు, నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా భూమిలోకి తిరిగి చేరేందుకు ప్రతి ఇంటి బాత్రూం మరియు కిచెన్ నుండి వచ్చే వ్యర్థ నీటిని శుద్ధి చేసి భూమిలోకి నెమ్మదిగా ఇంకింపచేయు కట్టడం. మురుగునీరు రోడ్లపైకి రాకుండా , పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడానికి, సీజనల్ వ్యాధులు రాకుండా, ఈగలు, దోమల సంతతి పెరగకుండా, భూగర్భ జలాలు రీఛార్జి కొరకు ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ మహమ్మద్ రఫీ, తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడు గౌతకట్ల సుబ్బయ్య, పంచాయతీ కార్యదర్శి కె.శ్రీనివాసులు, టెక్నికల్ అసిస్టెంట్లు  సెక్షావలి, బాషా, మహేష్, ఫీల్డ్ అసిస్టెంట్  ఈర్ల. తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.