Listen to this article

ఆధారాలు లేకుండా ఆడియోలు, వీడియోలు వైరల్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం

జనం న్యూస్ పీబ్రవరి 16 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి : సిర్పూర్(టి)ప్రజాజ్యోతి ఫిబ్రవరి15
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి) మండ లంలోని బియ్యం స్మగ్లర్ల మధ్య జరిగిన సంభాషణ ఆడియో వైరల్‌గా మారింది. ఈ ఆడియోలో అధికారులకు డబ్బులు ఇచ్చినట్లు వారు చర్చించు కున్నారు. అయితే ఈ ఆరోపణల్లో నిజం లేదని, ఒకవేళ డబ్బులు తీసుకున్నట్లయితే అక్రమ రవాణా ను అడ్డుకునే ప్రయత్నం జరగక పోతుందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.గతంలో కొందరు అధికారుల ప్రమేయం ఉండి ఉండ వచ్చునని ఊహాగానాలు ఉన్నప్పటికీ,ప్రస్తుత అధికారులు కఠినంగా వ్యవహరిస్తుండడంతో స్మగ్లర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. దీంతో, వీరు అధికారులపై తప్పుడు ప్రచారం చేసి వారిని మార్పిడి చేయించేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం.తప్పుడు ఆరోపణలపై కఠినచర్యలు కౌటాల సీఐ ముత్యం రమేష్ స్పందిస్తూ, “ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి తమ అభి ప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉంది. కానీ, ఈ హక్కును దుర్వినియోగం చేసి అధికారుల ప్రతిష్టను దిగజార్చేలా తప్పుడు ఆరోపణలు చేయడం చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ శాఖను అప్రతిష్టపాలు చేసే వారిని ఉపేక్షించబోము,” అని హెచ్చరించారు. అలాగే, అక్రమ రవాణాపై సమాచారం ఉంటే పోలీ సులకు తెలియజేయాలని, అత్యవసర సమయంలో 100కు కాల్ చేయాలని సూచించారు.ఈ ఘటన రేషన్ అక్రమ రవాణా దందాలకు ఎదురులేని సవాలుగా మారింది.