

జనం న్యూస్. తర్లుపాడుమండలం.ఫిబ్రవరి17: తర్లుపాడు లో వెలసిన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం వేణుగోపాలుడు హనుమంత వాహనం పై భక్తులకు దర్శనం ఇచ్చారు కార్యనిర్వాహన అధికారి ఈదుల చెన్నకేశవ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్త జవ్వాజి విజయ భాస్కర రావు పర్యవేక్షణలో వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా హనుమంత వాహనం ఉభయ దాతలు కశెట్టి జగన్ బాబు వారి చే ప్రత్యేక పూజలు అర్చకులు కారంపూడి రమణచార్యులు,ఆగమనాచార్యులు లక్ష్మణ తిలక్ , కారంపూడి సాయి మోహన్ చే ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు స్వామి వారికీ విశేష అలంకరణ కూనపులి రమణ శర్మ అలంకరించారు, అనంతరం తర్లుపాడు మాడ విధుల్లో భక్తులకు దర్శనం ఇవ్వగా భక్తులు స్వామివారికి కాయాకర్పూరాలతో బ్రాహ్మరధం పట్టారు, ఉభయదాతలు కశెట్టి జగన్ బాబు వారి చే వినోద కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం లో వివిధ రకాల వాహన ఉభయదాతలు భక్తులు పాల్గొన్నారు