Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.విద్యా ప్రమాణాలు పెంచాల.ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు వృత్తి పట్ల అంకితభావం తో పనిచేసి విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంచాలని MEO 1 మరియు 2 L.నాగయ్య..C.R.అనంత కృష్ణ నందలూరు ఇన్చార్జి హెడ్మాస్టర్ షేక్ రౌఫ్ భాషా. కోరారు.స్థానిక నందలూరు హై స్కూల్ లో జరిగిన పాఠశాల క్లస్టర్ స్థాయి కాంప్లెక్స్ సమావేశం లో పాల్గొన్న ప్రైమరీ మరియు హై స్కూల్ ఉపాధ్యాయుల సమావేశంలో వీరు పాల్గొని మాట్లాడుతూ సకాలంలో సిలబస్ పూర్తి చేయాలని. సీ.మరియు డీ గ్రేడ్ విద్యార్థుల పట్ల శ్రద్ధ చూపాలని..తరగతి గదిలో విరివిగా బోధనా అభ్యసన సామాగ్రి వినియోగించాలని టెన్త్ క్లాస్ లో వంద శాతం ఉత్తీర్ణత శాతం సాధించాలని. సూచించారు.ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ పగడాల భరత్ కుమార్.జి.కృపానందం.సీ .వెంకట సుబ్బయ్య. అనంద్. సురేష్.జయం కొండమూర్తీ రామకృష్ణ.సూరే క్రిష్ణయ్య.రహముతున్నిస ఆదిల్ పాల్గొన్నారు.