

జనం న్యూస్ 16.ఫిబ్రవరి. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కంటె.ఏలియా.👉 రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఎస్సీ వర్గీకరణ లో మాలలకు జరిగిన అన్యాయాన్ని ఎత్తిచూపిన నాయకులు
👉 2011 జనాభా లెక్కలు వర్గీకరణకు ఆమోదయోగ్యంకాదని స్పష్టీకరణ
👉 2011లో ఉప కులాల వారీగా జనాభా లెక్కలు జరుగలేదు, అందులోనూ ఆ జనాభా లెక్కల కు వర్గీకరణ చేసిన లెక్కలకు 2 లక్షల కు పైగా వ్యత్యాసమున్నది👉 2011 లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఆంధ్రకు చెందిన మాలలు కొంత ఎక్కువగా లబ్ధి పొంది ఉండటం వాస్తవం కానీ తెలంగాణలోని మాలలు మాదిగల కన్నా వెనుకబడ్డ మాట కాదనలేని నిజం👉 తెలంగాణ రాష్ట్రం ఏర్పడి న 2014 నుండి 2024 వరకు ఎస్సీ లలో విధ్య, ఉద్యోగాలలో, ప్రభుత్వ స్కీం లైన దళిత బంధు, భూమి, సబ్సిడీలు, రాజకీయ పదవుల లో ఎవరు ఎక్కువ లబ్ధి పొందారో లెక్కలతో బయటపెట్టాలని డిమాండ్👉 రిజర్వేషన్ శాతాన్ని పెంచి పంజాబ్ రాష్ట్రం మాదిరిగా రెండు గ్రూప్ లు గా విభజించి సమానంగా కేటాయించాలని, లేదా తమిళనాడు తరహాలో ఉమ్మడి రిజర్వేషన్లను అలాగే ఉంచి, రిజర్వేషన్ శాతాన్ని పెంచి దానిని అత్యంత వెనుకబాటుకు గురైన వారికి కేటాయించాలని కోరారు👉 ఒకవేళ వర్గీకరణను ఇలాగే ఉంచదలిస్తే గ్రూప్ 1లో అత్యంత వెనుకబడిన కులాలకు 3% రిజర్వేషన్ ను, గ్రూప్ 2 లో కొంత మెరుగైన స్థితి లో ఉన్న మాలలను ఉంచి 6% రిజర్వేషన్ ను, గ్రూప్ 3 లో మరింత మెరుగైన స్థితి లో ఉన్న మాదిగలను ఉంచి 6% రిజర్వేషన్ ను కేటాయించాలని, కులాల వారీగా వర్గీకరణ చేయాలని సుప్రీం కోర్టు ఎక్కడ చెప్పలేదని తెలియజేయటం జరిగింది👉 మాలల మనోభావాలను పట్టించు కోకుండా ఏకపక్షంగా మాలలకు నష్టం జరిగేలా వర్గీకరణ చేస్తే నికర ఓటు బ్యాంకు గా ఉన్న మాలలను దూరం చేసుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన గొయ్యి తనే తవ్వుకున్న చందంగా ఉంటుందని వారు సూచించారు👉 మాల సంఘాల ప్రతినిధులతో చర్చించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్ని విషయాలను పరిశీలించి తగు న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు
👉 మాల సంఘాల జేఏసీ చైర్మన్ జి చెన్నయ్య నాయకత్వం లో ఉప ముఖ్యమంత్రి నీ కలిసిన వారిలో కో చైర్మన్ లు బూర్గుల వెంకటేశ్వర్లు, చెరుకు రాంచందర్, గోపోజు రమేష్,, బేరా బాలకిషన్, తాళ్ళపెళ్లి రవి, ఆవుల సుధీర్, విశాల్, ఉమాకంత్, చేతన్, నవీన్, శ్రీమతి సరళ, శ్రీమతి అంజలి తదితరులు ఉన్నారు