

జనం న్యూస్. 17ఫిబ్రవరి 2025.కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్ఆసిఫాబాద్ :కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ కార్యాలయంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి, మొక్కలు నాటి ఘనంగా నిర్వహించిన ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు కోవ లక్ష్మి . ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత , అలుపెరగని సేవకుడు , తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత కేసీఅర్ అని అన్నారు , తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాలనలో అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
