Listen to this article

జనం న్యూస్ 17 ; ఫిబ్రవరి 2025.కొమురం భీమ్ జిల్లా.డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె. ఏలియా. – జైనూర్ మండలం పోచంలొద్ది గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి అనంతరం ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు 40 మందికి పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు ఆత్రం. శంకర్కొ లాం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని ,కేసీఆర్ అలుపెరగని సేవకుడు, తెలంగాణ రాష్ట్ర అభవృద్ధి ప్రదాత ,రైతుబంధువుడు అందరివాడు,పేదల పెన్నిధి కేసీఅర్ అని అన్నారు. ఈ కార్యక్రమము జైనూర్ సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు మడావి.భీంరావు ,ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు కుమ్ర. భగవంత్ రావు,మాజీ సర్పంచులు ఆత్రం సార్జబాయి , శంకర్ , మెస్రం.రాహుల్ ,మాజీ డైరెక్టర్ గేడాం.లక్ష్మణ్ , నాయకులు ముండే. సతీష్ కుమార్ ,శంకర్ కొలాం ,మారు సురేష్భీం రావు,కేసీఆర్ అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.