Listen to this article

హోమం, పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.

జనం న్యూస్ ఫిబ్రవరి 17; జమ్మికుంట కుమార్ యాదవ్..తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని, హుజురాబాద్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, సుదర్శన హోమం ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ, సంప్రదాయపూర్వకంగా హోమం నిర్వహించగా , కేసీఆర్ ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, “తెలంగాణ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన మహానేత కేసీఆర్ ఆశయాలు సుసంపన్నం కావాలని మనసారా కోరుకుంటున్నా అన్నారు.ఆయన నేతృత్వంలో గడిచిన 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు.అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ, సంక్షేమాన్ని ప్రతి ఇంటికి అందించిన గొప్ప నాయకుడిగా కేసీఆర్ నిలిచారన్నారు. తెలంగాణ ప్రజలు మరోసారి కేసీఆర్ నేతృత్వాన్ని కోరుకుంటున్నా రని, రాబోయే రోజుల్లో టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్) పార్టీ తిరిగి అధికారంలోకి రావడం అనివార్యమని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.