

జనం న్యూస్ :17 ఫిబ్రవరి సోమవారం : సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి; లలిత చంద్రమౌళిశ్వర దేవస్థానంలో అవధాని మారెపల్లి పట్వర్దన్ఒ కేరోజు ఆరు అష్టావధానాలు చేసి అలరించారు. ఆదివారం రోజున ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి వరకు సాగింది. ఒకేరోజు ఆరు అవధానాలు జరుగడం పట్ల సిద్దిపేట సాహిత్య ప్రియులు ఆనందం వ్యక్తం చేశారు. పద్యసాహిత్యం అవధానాల మూలంగా రిడవిల్లుతుందన్నారు. ఆలయ నిర్వాహకులు పండరి రాధాకృష్ణ అవధానంలో పృచ్చకులుగా ఉండ్రాళ్ళ రాజేశం, ముద్దు రాజయ్య, నల్ల అశోక్, వేదాల గాయిత్రిదేవి, భ్రమరాంభిక, అరవెళ్ళి శ్రీదేవి, నాగేశ్వరావు, మచ్చ అనురాధ, సంధ్యారాణి వెంకటేశ్వర్లు , సింగీతం నరసింహారావు , అష్టకాల విద్యాచరణ్, దుడుగు నాగలత, బస్వ రాజ్ కుమార్, మల్లంపల్లి శిరీష, భావన, మాధవీలత, వరుకోలు లక్ష్మయ్ తదితరులు పాల్గొన్నారు.