Listen to this article

జనం న్యూస్: 17 ఫిబ్రవరి సోమవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం 17, ఫిబ్రవరి తెలంగాణ పర్వదినాన్ని పురస్కరించుకుని రుస్తుంఆర్ట్ గ్యాలరీ లో “తెలంగాణ జాతిపిత కేసీఆర్” క్యాన్వాస్ చిత్రాన్ని ప్రఖ్యాత చిత్రకారులు రుస్తుం నేడు అవిష్కరించిరి. తదుపరి మాట్లాడుతూ కేసీఆర్ పుట్టుకే తెలంగాణ రాష్ట్ర సంచలన చరిత్ర. అనచబడ్డ భూమిలోనే ఉప్పెనలా ఎగిసిపడ్డ తెలంగాణ రాష్ట్ర సాధన ఉధ్యమ అధినేత తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర జాతిపితగా సుస్థిర పాలన కొనసాగినది. నిరుద్యోగ సమస్యలను ఉద్యోగ విమర్శలను అధిగమిస్తూ ఐకమత్యం తో ప్రజాసంక్షేమ పథకాలను అమలుచేస్తూ రైతు బిడ్డగా, రైతు బంధువుగా,రైతు భీమా, కళ్యాణ లక్ష్మీ షాదీముబారక్, శిశుసంరక్షా కేసీఆర్ కిట్టు, కంటివేలుగు, నీటి ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం గావిస్తూ పాడిపంటలతో  బంగారు తెలంగాణకు బాటలువేస్తూ జాతీయ రాజకీయాల్లో అవినీతిపై విరుచుకపడుతూ మంచివైపు దిశానిర్దేశం చేసిన కేసీఆర్ కు హ్యూమానిటి పెయింటర్ రుస్తుం కలర్ఫుల్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్య క్రమంలో ఆర్ఎ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం నైరూప్యచిత్రకారుడు నహీంరుస్తుం  అసిస్టెంట్ ప్రొఫెసర్ రుబినారుస్తుం, సాధిక్ మహ్మద్, ఎండి రహీం,  తదితరులు పాల్గొన్నారు.