

జనం న్యూస్. ఫిబ్రవరి 17. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) మల్లన్న స్వామి దీవెనలు ప్రజలపై ఉండి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్నీ లం మధు ముదిరాజ్ అన్నారు. సోమవారంనాడు హత్నూర మండలంలోని పన్యాల గ్రామంలో మల్లన్న స్వామి జాతర మహోత్సవంలో పాల్గొన్నారు. నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి,మెదక్ డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ గార్లతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఈ సందర్భంగా నిర్వాహకులు వారికి ఘన స్వాగతం పలికి శాలువా పూలమాలతో సత్కరించారు. అనంతరం నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ జాతర ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి ని ప్రతిబింబిస్తాయని తెలిపారు. గ్రామాల్లో జరిగే ఉత్సవాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనడంతో పాటు ప్రజలంతా ఐక్యమత్యంగా కలిసి ఉంటారన్నారు. ఆ మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో. మెదక్ డీసీసీ అధ్యక్షులు. ఆంజనేయులు గౌడ్,హత్నూర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.కర్రే కృష్ణ, టీపీసీసీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి. ఎం ఏ హకీం. పన్యాల మాజీ సర్పంచ్ బుచ్చిరెడ్డి ,శ్రీనివాస్ రెడ్డి,ఆంజనేయులు, ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర నాయకులు. చార్ల మణిదీప్పె ద్దగొల్ల మల్లేష్ యాదవ్,శ్రీనివాస్ యాదవ్, జాతర నిర్వాహకులు, గ్రామ ప్రజలు, యువకులు. తదితరులు భారీ ఎత్తున జాతర ఉత్సవాల్లో పాల్గొన్నారు.