Listen to this article

జనం న్యూస్ పిబ్రవరి 17 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నియోజకవర్గం లింగాపూర్ మండల కేంద్రానికి చెందిన జాధవ్ కలిబాయి భిక్కు నాయక్ దంపతుల కుమార్తె నిహారిక (సోనా) సచిన్ వివాహ మహోత్సవానికి రెహమాన్ ఫౌండేషన్సా మాజిక సేవకులు హాజరై రెహమాన్ ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలానీ సహకారంతో సామాజిక సేవలో భాగంగా జాటోత్ దవిత్ కుమార్ చేతుల మీదుగా ఆడబిడ్డ పెళ్ళికి కానుకగా సోమవారం 10000/- రూపాయలు అందజేయడం జరిగింది. అనంతరం రెహమాన్ ఫౌండేషన్ సామాజిక సేవకులు వధూవరులకు పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే రెహమాన్ ఫౌండేషన్ ద్వారా ప్రజల కష్టాలను తమ కష్టాలుగా భావించి ఎన్నో కుటుంబాలకు పెద్ద కొడుకుగా జాటోత్ దవిత్ కుమార్ స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సామాజిక సేవకులు జాధవ్ సుశీల్, జాధవ్ మారుతి, జాధవ్ రాజేష్, ఆడే కేతన్ నాయక్, రాథోడ్ రాజేష్, జాధవ్ అజేశ్, జాధవ్ వెంకటేష్, రాథోడ్ ప్రణీత్ తదితరులు ఉన్నారు